
యలమంచిలి డిసెంబర్ 18 (తెలుగు న్యూస్ పవర్) డివిజన్ స్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. నరసాపురం,మొగల్తూరు పోడూరు,యలమంచిలి పాలకొల్లు మండలాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. యలమంచిలి మండలంలో గురువారం ఈ పోటీలు జరిగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడపాడు లో మహిళ క్రీడాకారుల త్రో బాల్ పోటీలు జరిగాయి. స్థానిక ఎంపీటీసీ సభ్యులు డేగల సూర్యకుమారి మాజీ సర్పంచ్ అడ్డాల వాసుదేవరావు క్రీడాపోటీలు ప్రారంభించారు. ఐదు మండలాల మహిళ క్రీడాకారులు పాల్గొన్న త్రోబాల్ పోటీల్లో యలమంచిలి మండల ఉపాధ్యాయినిలు విజేతగా నిలిచారు. స్థానిక ఇలపకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ ఇక్కడ జరుగుతున్న క్రికెట్ పోటీల్లో లాంచనంగా పాల్గొన్నారు. ఈ క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. యలమంచిలి మండలం 122 పరుగులు చేసింది. అయితే దుర్గాప్రసాద్ పిడి టీం 95 రన్నలు చేసింది. చీకటి పడిన కారణంగా ఆట మరుసటి రోజుకు పొడిగించారు. ఈ సందర్భంగా పాలకొల్లు ఎంఈఓ గుమ్మళ్ళ వీరస్వామి, రామకృష్ణంరాజు, శ్రీవాణి ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ క్రీడా పోటీల నిర్వహణను రేలంగి రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ఈ పోటీలు సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పీడీలు శంకర్, బోనం విజయ్, గడ్డం మాత మహాలక్ష్మి పలువురు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి మండల మహిళా విజేతలను అధికారులు ప్రజాప్రతినిధులు ప్రశంసించారు.