పాలకొల్లు: డిసెంబర్,6(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయ ఉద్యమం కోసం, కుటుంబాన్ని త్యాగం చేసిన త్యాగదనుడు, అమరజీవి ఎస్ ఆర్ పోలిశెట్టి అని, ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి, నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత ఎస్ ఆర్ పోలిశెట్టి 25వ ఉమ్మడి జిల్లా వ్యాప్త,వర్ధంతి సభ, మంగళవారం రాత్రి,, స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల, దాసరి నారాయణరావు వేదిక వద్ద జరిగింది. ఈ సభకు బోర్ర గోపి మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు అధ్యక్షత వహించారు. యుటిఎఫ్ వ్యవస్థాపక కార్యదర్శిగా ఆయన రూపొందించిన, విధానం పత్రం, సమ సమాజ స్థాపనకు పునాదని గోపి మూర్తి పేర్కొన్నారు. ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా, ఉద్యమాన్ని నిర్మించి, నడిపించడం లో వారి కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యకర్తలను గుర్తించి, వారిని నాయకులుగా తీర్చిదిద్దడంలో, ఎస్సార్ పోలిశెట్టి దిట్టని కొనియాడారు. అలాంటి వారిలో, దివంగత యుటిఎఫ్ నేత, మాజీ ఎమ్మెల్సీ సాబ్జీ ఒకరిని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు, ఉపాధ్యాయ నేతలు ఎస్ఆర్ పోలిశెట్టి ఘనతను స్మరించుకున్నారు. ఎస్ ఆర్ పోలిశెట్టి ధర్మపత్ని విజయలక్ష్మి, కుమారులు పీవీ నరసింహారావు, వారి కుటుంబ సభ్యులు, వేదిక వద్ద నివాళులు అర్పించారు. ఈ సభకు లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి పలువురు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే,
రామశేకర్, శ్రీదేవి, సుభాషిని, పోలిశెట్టి క్రాంతి కుమార్, జి శ్రీనివాస్, సిఐటియు నాయకులు దేవ సుధాకర్, జనవిజ్ఞాన వేదిక నాయకులు రామ లక్ష్మణ్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
త్యాగధనుడు పోలిశెట్టి ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి
సభలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ గోపి