Telugu News Power

దళితుల అభివృద్ధి కూటమి లక్ష్యం – మంత్రి నిమ్మల రామానాయుడు.

రిపబ్లిక్ డే రోజు శ్రమదానం చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి,26(తెలుగు న్యూస్ పవర్) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో, దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక ఎమ్మార్వో కార్యాలయ సమీపంలో ఉన్న, అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల, రక్షణ, సుందరీకరణ లో భాగంగా, పైస్లాబ్ నిర్మాణానికి, మంత్రి తనవంతుగా శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో, పసుపులేటి రాజేష్ ఖన్నా, మున్సిపల్ కమిషనర్, విజయ సారథి, ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ఉన్నమట్ల కపర్తి, బోనం చినబాబు, మీసాల రామచంద్ర రావు, పొట్నూరి శ్రీనివాస్, చిన్నమిల్లి గణపతిరావు, మహమ్మద్ జానీ , మండెల రాంప్రసాద్, ధనాన్ని సూర్య ప్రకాష్, సలాది నాయుడు తదితరులు పాల్గొన్నారు.