Telugu News Power

దేవుని పాట, జనం ఆట నేటి నుంచే సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాలకు ఆహ్వానిస్తున్న తాలూరి శ్రీనివాస్ బుజ్జి

పాలకొల్లు: జనవరి,13(తెలుగు న్యూస్ పవర్) విశ్వవ్యాప్తమైన తెలుగువారి వారసత్వ సంపద, సంస్కృతీసంప్రదాయం. సంక్రాంతి పండగ శోభతోతో గాని అది సంపూర్ణం కాదు. అందుకే దేశ విదేశాల నుంచి ఆ పండుగ మూడు రోజుల కోసం, 365 రోజులు ఎదురు చూస్తుంటారు. బంధుమిత్రులతో ఇదే విషయంపై తరచూ చర్చించుకుంటూ ఉంటారు. గతేడాది సంబరాలు పంచిన ఆనందాన్ని ఇంకా మరచిపోక ముందే మరో సంక్రాంతి తెలుగుముంగిట వాలింది. ధనుర్మాసం గత నెల 16 నుంచి ప్రారంభమైంది. దీంతోపాటే హరిదాసులు, గంగిరెద్దులవారు పల్లెబాట పట్టారు. ఎన్నో సాంప్రదాయ కళలు కాలగర్భంలో కలిసిపోయాయి. నేటి తరానికి అవి మచ్చుకైనా కానరావు. సంక్రాంతి లక్ష్మికి గొబ్బెమ్మలతో ఆడపడుచు స్వాగతం పలికారు. ముందుగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న రు. బహుమతులు పొందారు. బహుమతి టీవీ అయినా కావచ్చు, వన్ గ్రామ్ గోల్డ్ అయినా కావచ్చు, వారిలో సృజనాత్మక శక్తిని ప్రకటించుకోవడానికి, ప్రోత్సాహం పొందటానికి పోటీలు ఎంతగానో మహిళలను ఆకట్టుకున్నాయి. సంప్రదాయ క్రీడలు, కబడి, వాలీబాల్ పోటీలు కూడా జరిగాయి. ఇవి రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయిలో జరిగాయి. చాలా చోట్ల ఈ క్రీడలు జరిగినప్పటికి, మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి పోటీలు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలిచాయి. అడవిపాలెంలో, మండల తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి అంజిబాబు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా తొలిసారి పోటీలు నిర్వహించారు. యలమంచిలి లో తాళ్లూరు బుజ్జి, వైజాగ్ బుజ్జి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో చిలుకూరి వెంకటేశ్వరరావు మెమోరియల్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఇక అసలు విషయానికి వస్తే నేటి నుంచి ప్రారంభమై మూడు రోజులపాటు జరిగే ఈవెంట్లలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఎక్కడెక్కడ నుంచో సంక్రాంతి సంబరాల్లో మజా ఆస్వాదించడానికి ఇక్కడకు జనం వేల సంఖ్యలో తరలి వస్తారు. వారికి, పసుందైన, పదుల సంఖ్యలో గోదావరి పిండి వంటల రుచులు, భోజనాలతో ఆతిథ్యం ఇవ్వటానికి నిర్వాహకులు పోటీ పడుతుంటారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో, ఎందరో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎదిగి ఆర్థిక పరిపుష్టి సాధించారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చినవీరు పండుగకు సొంతకారులతో రావడంతో, గ్రామాల్లోని వీధులన్నీ కార్లతో నిండిపోయాయి. నాడు నాయకురాలు నాగమ్మ ,పలనాటి గడ్డపై చరిత్ర సృష్టించడానికి కోడిపందాలే కారణం. నేడు గోదావరి జిల్లాల్లో, అనేక గ్రామాలు చిన్నాచితక పందెంబరుల నుంచి లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో పాడుకున్నారు. అయితే ఈ సొమ్ముకు, లెక్క పత్రం ఏమీ ఉండవు. పండగ ఎమర్జెన్సీ కావడం వల్ల ఖర్చు భారీగా జరిగిపోవచ్చు. నష్టం కూడా రావచ్చు. ఇక్కడ పండగ ఎలా జరిపిపాం అనే దాని మీదే దృష్టంతా కేంద్రీకరించి ఉంటుంది. సంక్రాంతి ఒక సంప్రదాయ పండగలా కనిపించవచ్చు, కానీ తమ పట్టు నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం కూడా. అందుకే కొన్ని గ్రామాల్లో ఆదిపత్య పోరుకోసం పట్టుపడుతుంటారు. రాజీ కుదరకపోతే, ఇరుపక్షాలు,డేగ, నెమలా అన్నట్టు, పందానికి దిగుతాయి. చాలా ఏళ్లుగా చేస్తున్నవారు, పండగ నిర్వహణలో ఆనుపానులన్నీ ఔపాసన పడతారు. వారికి వచ్చే జనం మీద, ఖర్చు మీద ఓ అవగాహన ఉంటుంది. వివిధ ఈవెంట్లకు, పిండి వంటలకు, భోజనాలకు అయ్యే ఖర్చుపై అంచనా ఉంటుంది. ముందుగా మేలుకోవడం వల్ల వీరికి కొంత కలిసి వస్తుంది. కొత్తగా దిగేవారికి, లోతు తెలియటం కొంచెం కష్టం. అయితే,ఆర్థికంగా దమ్మున్నవారైతే ఇవి సమస్యలు కావు. ఇక ఈవెంట్ల విషయానికొస్తే, పాత వారిది పై చేయిగా ఉండొచ్చు. కొత్తవారికి అప్పటికప్పుడు దొరకడం కొంచెం కష్టం. ఏమైనా,ఆడుతున్నారు.పట్టు సడలకుండా కాపాడుకోవడానికి ఒక వర్గం, పట్టు సాధించటానికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడునే మరో వర్గం వ్యూహం ప్రతి వ్యూహాలు రచించడం పరిపాటి. పండగ విందులో ఎవరికివారు తగ్గేదేలే అన్నట్టు ఉన్నారు. భోగి రోజు 6వేల మందికి వంట ప్రారంభిస్తున్నరు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. రెండు వర్గాలు తలపడుతున్నప్పుడు, తటస్థులకు తలపోటు తప్పకపోవచ్చు. ఫ్లెక్సీ కి ఫోటో ఇస్తే ఏ వర్గం వారు ఏమనుకుంటారో అని అసలు ఫోటో కూడా ఇవ్వడానికి భయపడే పరిస్థితి. ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? అంటే ఏ పక్కన చెప్పలేని అయోమయస్థితి. ఎన్ని వర్గాలు పండుగ జరిపిన, లాభపడేది సామాన్యులు,సగటు వేతనజీవి, వారి కుటుంబం. పోటాపోటీగా మూడు రోజులు సంక్రాంతి సంబరాలు జరగటం పాలకొల్లు నియోజకవర్గం లో మొదటిసారి. ఫలితం ఎలా ఉంటుందోని ప్రజలు ఆసక్తి చర్చించుకుంటున్నారు. అయితే సంక్రాంతి సంబరాలు జరపడం ఎవరికైనా కత్తి మీద సాములాంటిదే. అధికారం అండం, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కష్టమేనంటున్నారు. నిర్వాహకులు. ఒకవేళ మంత్రి నియోజకవర్గం అయినా కూడా ఎవరి ముడుపులు వారికి చెల్లించవలసిందేనని చెబుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే సంబరాలు జరిగే,ఆయా ప్రాంతాల వద్ద ప్రభుత్వ ఆదేశాల హెచ్చరిక బ్యానర్లు కట్టారు. నేటి నుంచి అసలైన,ఆట మొదలవుతుంది. గుండాట, పేకాట, వంటి జూద క్రీడలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు చీర్ గర్ల్స్ రానున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. ఆడ,మగ సరదా కోసం కొందరు, జాక్పాట్ కొట్టడానికి మరికొందరు, ఈ జూదం ఆడుతున్నారు.పెద్ద పండుగ, వేల కోట్ల వ్యాపారమే. భోగి పిడకలు ఆన్లైన్లో అమ్మడం దగ్గరనుంచి, పిండి వంటల వరకు అంత వ్యాపారమే. ప్రతి తెలుగువాడు కొత్త బట్టలు తప్పక ధరిస్తారు. మంగళవారం రాత్రి వరకు ఈ అమ్మకాలు జరిగే షాపులు ఉన్న రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రీమియం తత్కాల్ టికెట్ ధర, హైదరాబాదు నుంచి పాలకొల్లుకు 18 వందల ధర పలికింది. ప్రైవేటు బస్సుల సంగతి సరే సరే. జానెడు పొట్టకు, బారెడు పిండి వంటలతో భోజనం అయితే ఉచితంగా దొరుకుతుంది. కానీ కాస్త నడుము వాల్చాలంటే 5వేలు పెట్టిన రూము దొరకని పరిస్థితి. కొంతమంది మూడు నెలల ముందే ఖాళీగా ఉన్న బిల్డింగులు అద్దెకు తీసుకున్నారు. పార్కింగ్ స్థలాలు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక పార్కింగ్ స్థలం కోసం, యజమాని 15 లక్షల వరకు డిమాండ్ చేసినట్టు, నిర్వాహకులు 9 లక్షల వరకు ఆఫర్ ఇచ్చినట్టు పుకార్లు చెలరేగారయి. అయినప్పటికీ అడిగి ఓకే కాలేదు అంటున్నారు. ఇప్పటికే, కొత్త అల్లుళ్ళు, ఆడపడుచులు పుట్టిళ్లకు చేరుకున్నారు. అతిథులగా స్థానికుల ఇంటి విందు ఆరగిస్తున్నారు. సోమవారం నాటికి అతిధులు పిలిచి ఆతిథ్యం ఇచ్చే కార్యక్రమం, ముఖ్యంగా క్షత్రియులు పూర్తి చేశారు. ఎవరికి వారు పండుగ సంబరాలు చూసి ఆనందించడానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోదావరి ఆవల జరిగే జగ్గంతోట ప్రభల పండుగకు, రాష్ట్ర హోదా కల్పించారు. దీంతో గోదావరి జిల్లాల పెద్ద పండుగ ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా మరింత శోభాయమానం కానుంది.

సంక్రాంతి సంబరాలు ఆహ్వానం పలుకుతున్న బోప్పన హరి కిషోర్, చిన్న