Telugu News Power

నంది వాహనంపై గ్రామోత్సవం

శివ,విష్ణువుల గ్రామోత్సవం

పాలకొల్లు: డిసెంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పవిత్ర ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత జనార్ధన స్వామి గ్రామోత్సవం సాయంత్రం మేళతాళాల, సంగీత వాయిద్యాలతో ఘనంగా జరిగింది.
విగ్నేశ్వర పూజ
స్థానిక క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో మంగళవారం, ఏడు వారాల, మారేడు దళాల ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు విఘ్నేశ్వర స్వామి వారి పూజ, శివ సహస్రనామ పూజ జరిపించారు. భక్తులు ఈ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, అర్చకులు క్రిష్టప్ప పూజలు జరిపించారు.
ఈ కార్యక్రమాల్లో, ఆలయ ఈవో, ముచ్చర్ల శ్రీనివాస రావు, చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ట్రస్టీ పెనుమత్స శ్రీదేవి, అర్చకులు, క్రిష్టప్ప,అనిల్, పర్యవేక్షకులు పి వాసు తదితరులు పాల్గొన్నారు.

విగ్నేశ్వర పూజ కార్యక్రమంలో భక్తులు