Telugu News Power

నేటి నుంచే రైలు టిక్కెట్ల ధర పెంపు.

న్యూఢిల్లీ: డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) భారత రైల్వే శాఖ నేటి నుంచి ప్రయాణికులు టిక్కెట్ ధర పెంచింది. సబర్బన్(సింగిల్ జర్నీ) టిక్కెట్ ధర పెరగలేదు. అలాగే సబర్బన్, నాన్ సబర్బన్ సీజన్ టిక్కెట్ల ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు.
సాధారణ రైళ్లు, ఏసీ లేనివి.
రెండవ తరగతి (నాన్ ఏసి)
215 కీ. మీ. వరకు – పెంపు లేదు
216 నుంచి 750 కి మీ –
రూ 5/- పెంపు
751 నుంచి 1250 కి మీ వరకూ
రూ 10/- పెంపు
1251 నుంచి 1750 కి మీ వరకూ రూ. 15/-పెంపు
1751 నుంచి 2250 వరకూ
రూ. 20/-

స్లీపర్ క్లాస్.(ఆర్డినరీ) కి. మీ. 1పైసా పెంపు
ఫస్ట్ క్లాస్ (ఆర్డినరీ) కి మీ 1 పైసా పెంపు
మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్ళు
రెండవ తరగతి – ప్రతి కి మీ కు 2పైసలు -పెంపు
స్లీపర్ క్లాస్- ప్రతి కి మీ కు 2పైసలు పెంపు
మొదటి తరగతి-ప్రతి కి మీ కు 2పైసలు పెంపు

ఏసీ తరగతులు
ఏసి చైర్ కార్- ప్రతి కి మీ 2 పైసలు పెంపు
ఏసి 3 టైర్/3E – ప్రతి కి మీ 2 పైసలు పెంపు
ఏసి 2 టైర్ – మంత్రి కి మీ 2 పైసలు పెంపు
ఏ సీ ఫస్ట్ క్లాస్ – ప్రతి కి మీ కు 2పైసలు పెంపు

ప్రీమియం రైళ్లకు పెంపు వర్తింపు
ఈ పెంపు రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, హంసఫర్, అమృత్ భారత్, గరీబ్ రథ్, జన శతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, నమో భారత్ రాపిడ్ రైల్ తదితర రైళ్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. మొత్తం మీద సామాన్య ప్రయాణికులపై, సీజన్ టిక్కెట్ల ధరలో పెంపు లేకుండా ఆయా వర్గాలకు ఊరట కలిగించింది.