Telugu News Power

నేడు ఎలుకల మందు పంపిణీ

యలమంచిలి: ఫిబ్రవరి,3 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలంలో సామూహి ఎలుకల నిర్మూలనలో భాగంగా విషపు ఎర ఉచితంగా పంచుతున్నట్టు వ్యవసాయ అధికారి డి. బాలా త్రిపుర సుందరి మంగళవారం తెలిపారు. రైతులు పొలాల్లో ఎలుకల బొరియలు పూడ్చివేసి, తెరుచుకున్న బొరియల్లో ఈ ఎరవేసి వేసి మూసివేయాలని సూచించారు. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో నూకలు, నూనె, విషం కలిపిన ముందు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ ముందు పసిపిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు. ఈ మందులు అన్ని గ్రామాలలోని రైతులు, కౌలు రైతులు ఒకేసారి మందు పెట్టడం వల్ల ఫలితాలు వస్తాయని, ఎలుకల ప్రభావం దాల్వా పంటపై గననీయంగా తగ్గుతుందని వెల్లడించారు.