భీమవరం: మార్చి, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న, వంట గ్యాస్ సమస్య పరిష్కారానికి పశ్చిమగోదావరి జిల్లా అధికారులు పరిష్కారం సూచించారు. వినియోగదారులు ఎవరైనా వంటగ్యాస్ పొందటానికి ఇబ్బందులు పడుతుంటే, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గ్యాస్ సమస్య ఎదురైనప్పుడు,8121676653 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే, సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి,సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని, గ్యాస్ ఏజెన్సీలు అక్రమ మార్గాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ ఎక్కువ ధరకు అమ్మడం, బ్లాక్ మార్కెటింగ్ చేస్తే, నిరంతరం పనిచేస్తున్న నిఘా వర్గాలు వారి పై చర్యలు తీసుకుంటాయని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
పశ్చిమగోదావరి జిల్లా గ్యాస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి