Telugu News Power

పాన్ ఇండియా చిత్రాల రచయిత విజయేంద్రప్రసాద్ అంతర్వేది పర్యటన.

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద విజయేంద్రప్రసాద్

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) ప్రఖ్యాత పాన్ ఇండియా చిత్రాల రచయిత, రాజ్యసభ సభ్యులు, ప్రముఖ దర్శకులు రాజమౌళి తండ్రి కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్, స్థానిక అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. అంతర్వేది క్షేత్రం చాలా బాగుందని, కళా గా ఉందని, భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్షేత్రం దర్శించుకుంటే భక్తులకు కష్టాలు తీరుతాయని, అందరూ వచ్చి ఈ దైవ దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ మర్యాద ప్రకారం అధికారులు వీరికి స్వాగతం పలికారు.