
పాలకొల్లు: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, పాలకొల్లులో రూరల్ పంచాయతీని గాలికి వదిలేసిందని మంత్రి, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. అటు పంచాయతీకి,ఇటు మున్సిపాలిటీకి చెందకుండా అభివృద్ధిలో వెనుకబడిపోతున్న, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం,ఉపముఖ్యమంత్రి,,పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కలెక్టర్ తదితర అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే శంకుస్థాపన సభలో వెల్లడించారు. పని చేయని ప్రభుత్వానికి ఓటు వేయడం సరికాదన్నారు.నాగరాజు పేట, వడ్లవానిపాలెం కాపవరం వెంకటాపురం గ్రామాల గుండా వెళ్లే 6.60 కిలోమీటర్ల రోడ్డు పనులకు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు, నిమ్మల రామానాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులకు 4.30 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. ఈ రహదారి కొన్నిచోట్ల సిమెంట్ రోడ్డు, మరి కొన్ని చోట్ల తారు రోడ్డు వేస్తారు. కొమ్ము చిక్కాల నుంచి ముడుగు పోలవరం వరకు ఆర్ అండ్ బి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు 1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో, మాజీ మంత్రి, ఆచంట శాసనసభ్యులు, పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కె విజయభాస్కర్, దాసరత్నం రాజు, గొట్టుముక్కలు నారాయణ రాజు, రాంబద్ర రాజు, పాముల రజని కుమార్, యర్రంశెట్టి పద్మారావు, ఉన్నమట్ల కపర్ది, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు