Telugu News Power

పాలకొల్లు రోటరీ సేవలు అభినందనీయం

పోషకాహారం అందిస్తున్న ఆనందరాజు

పాలకొల్లు: జనవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రోటరీ క్లబ్ వారు, శనివారం పోషకాహార కిట్లు, లంకల కోడేరు ప్రాథమిక ఆసుపత్రిలో పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, క్షయ వ్యాధి నివారణ కోసం, మందులు వాడుతున్న వారికి పోషకాహార కిట్లు, పాలకొల్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు, నిక్షయ మిత్ర డాక్టర్ కోసూరి రామకృష్ణ ఆనందరాజు, వారి సభ్యులతో కలిసి అందజేశారు. 35 మంది గర్భిణీ స్త్రీలకు, 20 మంది టీబీ వ్యాధికి నివారణ పొందుతున్న వారకి, కిట్లు అందజేశారు. డిప్యూటీ,ఎంపీడీవో మూర్తి బాబు, రోటరీ సేవలకు అభినందనలు తెలియజేశారు. స్థానిక వైద్యులు నవ్య జీవన్ మాట్లాడుతూ, క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తూ, వారికి పరీక్షలు చేయించి, చికిత్స అందిస్తున్నామన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఆరు నెలల పాటు ఉచితంగా మందులు అందిస్తున్నామన్నారు. పోషకాహారం కోసం నెలకు వెయ్యి రూపాయల నగదు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి, పోతా బత్తుల సత్యనారాయణ, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాసరావు, కార్యదర్శి రాజేష్ కుమార్, విస్తరణ అధికారి గుడాల హరిబాబు, పీవీ స్వామి, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.