పాలకొల్లు: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పుష్కర కాలంగా, నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు,ధర్మారావు ఫౌండేషన్ తరపున నిర్వహిస్తున్నట్టు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు వెల్లడించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో, సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల సందర్భంగా బాబు మాట్లాడుతూ, ఈ నెల 9 నుంచి ముగ్గుల పోటీతో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పాలకొల్లు లో ఈ నెల 9న, యలమంచిలిలో 10న జున్నూరు లో 11న మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తారు. ఎమ్మెల్యే కఫ్ కబాడీ పోటీలు, ఆడిటర్ రామరాజు స్మారక పోటీలుగా నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. జనసేన నాయకులు బోనం నరసయ్య మాట్లాడుతూ, రాబోయే తరాలు, తెలుగువారి సంస్కృతి,సంప్రదాయ మరిచిపోకుండా ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి ఏటా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏర్పాటు చేయడం పట్ల వర్షం వ్యక్తం చేశారు. కుటుంబ సమేతంగా ఈ సంక్రాంతి సంబరాలు చూడటానికి రావాలని, నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర బిజెపి మీడియా అధికార ప్రతినిధి ఉన్నట్ల కాపర్థి, మాట్లాడుతూ, సంక్రాంతి సంబరాల ముగింపు, రాజకీయాలకు అతీతంగా, అందరిని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షులు, గండేటి వెంకటేశ్వరరావు,జీవి, మాట్లాడుతూ, మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీయడానికి ఈ ముగ్గుల పోటీలు, ఎమ్మెల్యే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విజేతలకు, టీవీ, ఫ్రిడ్జ్, తదితర బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో, జనసేన జిల్లా నాయకులు, కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్, తులా రామలింగేశ్వర రావు, పినిశెట్టి శ్రీనివాస్, మైనార్టీ సెల్ నాయకులు జానీ, ఎస్సీ సెల్ నాయకులు పీతల శ్రీనివాస్, యలమంచిలి మండల, తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
పాలకొల్లు సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం.
సంక్రాంతి సంబరాల ఆహ్వాన పత్రిక విడుదల చేస్తున్న కూటమి నాయకులు