Telugu News Power

పింఛన్ల పంపిణీలో కలెక్టర్ నాగరాణి.

దివ్యాంగులు పింఛను పంపిణీ చేస్తున్న కలెక్టర్ నాగరాణి

నర్సాపురం: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో, కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పాల్గొన్నారు. పింఛన్దారులను స్వయంగా కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణం లోని 15వ వార్డు మసీదు సెంటర్, వలవల వారి వీధి బొండమ్మ మహిళ వృద్ధుల ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ శ్
చదలవాడ నాగరాణి, ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.పింఛన్దారులకు
పింఛన్లు, పండ్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ వ్యక్తిగతంగా ఆరా తీశారు.
మార్చి 1 ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28నే పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 24 రకాల పింఛన్ల కింద 2,22,980 మంది లబ్ధిదారులకు రూ.96.39 కోట్లు పంపిణీ జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు.
ఏవైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత మున్సిపల్ కమిషనర్లు లేదా ఎంపిడిఓలను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఏ, పిడి ఎం.ఎస్.ఎస్. వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ ఆర్. వెంకట రామిరెడ్డి, డిపిఎం శ్రీనివాస్ ప్రసాద్, ఏపిఎం జె. నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.