Telugu News Power

పి ఆర్ సి కమిటీని వెంటనే నియమించాలి. -ఫ్యాప్టో చైర్మన్ లంకపల్లి శ్రీనివాస్

పాలకొల్లు: మార్చి, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్యాప్టో చైర్మన్, ఎస్టియు రాష్ట్ర నాయకులు లంకపల్లి శ్రీనివాస్ 12వ పిఆర్సి కమిటీని వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ పాఠశాలలో పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి బుధవారం వివిధ పాఠశాల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇప్పటికే బకాయి ఉన్న 34 వేల కోట్ల ఉపాధ్యాయులకు చెల్లించడానికి దిశా నిర్దేశం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల పిఎఫ్ నిధులు వెంటనే జమ చేయాలని కోరారు. అర్బన్ విద్యాశాఖ అధికారి పోస్టులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రతి ఏటా బదిలీలు నిర్వహించాలని కోరారు. ఈ పర్యటనలో ఎస్ టి యు నాయకులు, డి రాంబాబు, సాయి వర్మ , డి రాజ్ కుమార్, నాగేశ్వరరావు, విజయ్, విక్రాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.