Telugu News Power

పోలియో ఆదివారం విజయవంతం

పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, కూటమి నాయకులు

పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. పోలియో ఆదివారం సందర్భంగా పలుచోట్ల పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద, దేశాలమ్మ గుడి వద్ద రోటరీ క్లబ్ పల్స్ పోలియో కేంద్రాలుఏర్పాటు చేసింది. పల్స్ పోలియో కేంద్రాల వద్ద మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టిడిపి పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, నోడల్ అధికారి పి నరేష్ కుమార్, వైద్యులు చంద్రశేఖర్, మణి త్యాగి, విస్తరణ అధికారి గుడాల హరిబాబు, కూటమి నాయకులు పెచ్చెట్టి బాబు, తులా రామలింగేశ్వర, బి సోమశేఖర్, పొట్నూరి శ్రీను, బి సత్యనారాయణ, మజ్జి వెంకటరమణ, ధనాని సూర్య ప్రకాష్, కొల్లికొండ ప్రసాద్, రోటరీ అధ్యక్షులు కోసూరి ఆనంద రామకృష్ణంరాజు, ముచ్చర్ల సంజయ్, పి సత్యనారాయణ, జి శ్రీనివాసరావు, చందక రాము, షేక్ పీర్ సాహెబ్, కావలి నగేష్, కిరణ్ గుప్తా, జవ్వాజి కళ్యాణ్, రావాడ సతీష్, ఆరమిల్లీ సురేష్, మున్సిపల్ అధికారులు రాజశేఖర్, బద్రీనాథ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

లంకలకోడేరు లో పోలియో చుక్కల కార్యక్రమం

లంకల కోడేరు:
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండల టిడిపి అధ్యక్షులు పాముల రజిని కుమార్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య అధికారి డాక్టర్ నవ్య జీవన్ ఆధ్వర్యంలో పోలియో చుక్కల కార్యక్రమం మండల వ్యాప్తంగా జరిగింది. డాక్టర్ నవ్య జీవన్ మాట్లాడుతూ పోలియో చుక్కలు కార్యక్రమం ఉదయం 7 గంటలకు మొదలై సాయంత్రం 6 గంటల వరకు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 95 శాతం లక్ష్యం పూర్తికాగా, మిగిలినవి కూడా పూర్తి చేస్తామన్నారు. సొసైటీ అధ్యక్షులు పెనుమత్స సత్యనారాయణ రాజు, నెక్కంటి ఆదినారాయణ, ఆకుల బ్రహ్మాజీరావు, తాళ్లూరి విజయలక్ష్మి, డాక్టర్ గమిని దినేష్, గుడాల హరిబాబు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ నర్సింగ్ కళాశాల బీఎస్సీ విద్యార్థినులు పల్స్ పోలియో కార్యక్రమంలో సేవలు అందించారు. ఉల్లంపర్రు మాంటిసోరి పాఠశాల బస్సులు వీరికి ఏర్పాటు చేశారు.