యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల వెలువడుతున్న, జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో పలువురు తెలుగువారు తమ అద్భుత ప్రతిభను చూపుతున్నారు. వారిలో ముందు వరుసలో నిలిచారు, పశ్చిమగోదావరి జిల్లా, మండల కేంద్రమైన యలమంచిలికి చెందిన తమ్మినీడి ప్రణవి శ్రీలక్ష్మి. జేఈఈ మెయిన్స్ లో 99.54 పర్సంటేయిల్ సాధించారు. ఈమె తండ్రి తమ్మినీడి శ్రీనివాస్, విశాఖపట్నంలో జర్నలిస్టుగా కాగా. తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకురాలు. ప్రణవి, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని, లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా, కొత్త ఆవిష్కరణలకు కృషి చేస్తానన్నారు. స్వగ్రామం యలమంచిలిలో, పలువురు ఆమె ప్రతిభను అభినందించారు. ఈ యలమంచిలి ముద్దుబిడ్డ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రణవి, మెయిన్స్ లో అద్భుత ప్రతిభ.
తమ్మినీడి ప్రణవి శ్రీలక్ష్మి