Telugu News Power

ప్రపంచమంతా ఉద్యోగాలే

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచమంతా ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు, నరసాపురం వైఎన్ కళాశాల హెచ్ఆర్డి సెంటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్. స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులకు బుధవారం వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ మార్గదర్శనం పై ముఖ్య అతిథి ప్రసంగంతో దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగాలు అందుకోవడానికి విద్యార్థులు నిరంతరం స్థిరత్వంతో కూడిన అభ్యసన , భావవ్యక్తీకరణ నైపుణ్యాలు సాధన చేయాలని సూచించారు. సాంకేతిక మార్పులను ఎప్పటికప్పుడు అందుపుచ్చుకునే ప్రయత్నం చేయాలన్నరు. విద్యార్థుల్లో ఉన్న బలహీనతలు, ఆత్మన్యూణ్యత భావాన్ని వెంటనే విడనాడాలని కోరారు. విద్యార్థులు లక్ష్యాలు నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి సర్వశక్తులు కేంద్రీకరించి, ప్రయత్నించాలని ఉద్బోధించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జీవితంలో ముఖ్యమైన, విద్యార్థి దశను సమర్థవంతంగా నిర్దేశించుకోవాలి పిలుపునిచ్చారు. అద్భుతమైన జీవితాన్ని మలుచుకోవటానికి ఇలాంటి ప్రముఖుల ఉపన్యాసాలు ఎంతో దోహద పడతాయన్నారు. కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు, కార్యదర్శి, కనుమూరి సీతారామరాజు, కోశాధికారి, ప్రవీణ్ భాను, ఎబిఎస్ మూర్తి, నందుల సీతారామారావు, ప్రసన్న నాగదేవి,రాము, జానకి రామయ్య, రవికుమార్ విద్యార్థులు పాల్గొన్నారు.

అవకాశాల కోసం ఆసక్తిగా వింటున్న విద్యార్థులు.