కాకినాడ: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేస్తున్నట్టు స్థానిక ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. మత్స్యకార సోదరుల అభ్యున్నతికి సంబంధించి నిధుల కోసం, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, తరచూ సంబంధిత శాఖ అధికారులతో చర్చలు జరిపానన్నారు.
ఫలితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు కేంద్రం రూ.72.42 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మత్స్యకార
సోదరసోదరీమణుల ఉన్నతికి ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు.
మత్స్యకారుల భద్రత, మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక సదుపాయాలు, ఆరోగ్య భద్రత, ప్రాసెసింగ్ యూనిట్లు, నిల్వ సదుపాయాలు, మెరుగైన రవాణా వ్యవస్థల కోసం ఈ నిధులు ఎంతో కీలకమని తెలిపారు. కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఈ మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు.డ్రెడ్జింగ్ ద్వారా నావల సాఫీ రాకపోకలు,
కొత్త జెట్టీలు, భద్రతా సౌకర్యాల పెంపు ఆధునికీకరించిన కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు,
హైజీన్ ప్రాసెసింగ్ యూనిట్లు
వేలాది మత్స్యకారుల మెరుగైన ఉపాధి కాకినాడ ప్రాంత మత్స్యకారుల అభివృద్ధికి కేంద్రంగా ఎదుగుతుందన్నారు.
మత్స్యకారుల సంక్షేమం, తీరప్రాంత అభివృద్ధి, కాకినాడ భవిష్యత్తు కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని ఎంపీ
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ కు రూ.72.42 కోట్లు మంజూరు.
కాకినాడ ఫిషింగ్ హార్బర్ ప్రస్తుత పరిస్థితి