Telugu News Power

బడుగుల ఆశాజ్యోతి రంగా -మంత్రి నిమ్మల రామానాయుడు నివాళి

వంగవీటి వర్ధంతి సభలో మాజీ ఎంపీ చేగొండి, మంత్రి నిమ్మల తదితర ప్రముఖులు.

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పవర్) బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని రాష్ట్ర జలవన రుల శాఖామాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు. పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద రంగా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రంగా కోసం ఒకప్పుడు ఎందరో నాయకులు ఎదురుచూసేవారన్నారు. కూటమి ప్రభుత్వం రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య, వంగా నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, కర్నేని గౌరు నాయుడు, ఉన్నమట్ల కవర్తి, ఎర్రం శెట్టి పద్మారావు, తులా రామలింగేశ్వర రావు, చోడిశెట్టి జ్ఞాన శంకర్, చేగోండి ప్రకాష్ ,మామిడిశెట్టి పెద్దిరాజు, గండేటి వెంకటేశ్వర్లు, పిచ్చెట్టి బాబు తదితరులు పాల్గొన్నారు.

రంగా వర్ధంతి సందర్భంగా మంత్రి నిమ్మల నివాళులు అర్పించారు.