ఆచంట: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కొడమంచిలికి చెందిన వెలగన వెంకట స్వామి (70) అని వృద్ధుడు ఏడేళ్ల బాలికపై అగైత్యానికి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. ఈ వృద్ధుడు గ్రామంలో బడ్డీ కొట్టు నడుపుతున్నాడు. బాలిక తినుబండారాలు కొనుక్కోడానికి వెళ్లిన సందర్భంగా, వృద్ధడు లైంగిక దాడికి పాల్పడ్డట్టు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.