Telugu News Power

భీమవరం ఆదిత్యాలో ఉద్యోగ మేళ.

భీమవరం: ఫిబ్రవరి, 24 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా ఈనెల 27న నిర్వహిస్తున్నారు.
ఉదయం 9:30 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్, గంగానమ్మ ఆలయం సమీపంలో, బ్యాంక్ కాలనీ, దిరుసుమర్రు రోడ్ లో జరుగుతుంది. ఈ ఉద్యోగం మేళాలో 21 పైగా ప్రముఖ కంపెనీలు 2000 పైగా ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
అభ్యర్థులు, పదవ తరగతి, ఇంటర్, ఐటిఐ,డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇటీవలి, ఉద్యోగ దరఖాస్తు(సీవీ), సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలి.
రోజువారి వేసుకునే డ్రస్‌లో హాజరు కావాలి. జన్పెక్ట్, టెక్ మహీంద్రా, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్ కాన్, హుందై,మోబిస్, యాక్సిస్ బ్యాంక్, ఐడిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, పనాసోనిక్, ఇసుజి మోటార్స్, లాంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి తరలివస్తున్నాయి.
🔗 రిజిస్ట్రేషన్ కోసం:
https://naipunyam.ap.gov.in/view-all-jobmela
మరిన్ని వివరాలకు పోస్టర్‌లో ఉన్న నంబర్లను సంప్రదించాలి.
భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం కోరారు.