అమరావతి: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత నమ్మకస్తడు, ఇష్టుడు అయినా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు మధ్య విభేదాలు తలెత్తయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శాసనమండలి చైర్మన్ హోదాలు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్సీలకు తాను అనుకున్న విధంగా అవకాశం కల్పించడం లేదని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు.
శాసన సభలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ వున్నట్లే, శాసన మండలిలో వైకాపాకు ఆధిక్యత వుంది. ఈ అవకాశాన్ని వాడుకొని, కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రయత్నం. కానీ శాసన మండలి ఛైర్మన్ మోషెన్‌రాజు తన ఆజ్ఞలను పాటించడం లేదన్న ఆగ్రహంతో మండి పడుతున్నాడు జగన్. గతంలో ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో శాసన మండలిలో తెలుగుదేశానికి ఆధిక్యత వుండేది. దాన్ని ఆసరాగా తీసుకొని, జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో మంజూరు చేసిన బిల్లులకు మండలిలో చీకాకులు సృష్టించే వారు. ఎంతో కీలకమైన ద్రవ్య పరపతి బిల్లు విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టడానికి ప్రయత్నం చేసింది. తనను అంత ఉడకాడించిన తెలుగుదేశం పార్టీని, మండలిలో వున్న మెజార్టీ ఆధారంగా తాను కూడా చీకాకు పెట్టాలన్నది జగన్ ఆలోచన. కానీ ఛైర్మన్ మోషెన్‌రాజు, జగన్ వీర విధేయులలో ఒకరైనప్పటికీ, శాసన మండలి సాంప్రదాయాల ప్రకారం మాత్రమే నడుచుకోవాలని నిర్ణయించుకోవడం వల్ల జగన్ కోరిక నెరవేరడం లేదు. తిరుమల లడ్డూ విషయంలో, హెరిటేజ్ డెయిరీ ప్రమేయం విషయంలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టడానికి వైకాపా సభ్యులు చేసే ప్రయత్నాలను ఛైర్మన్ హోదాలో మోషెన్ రాజు అనుమతించడం లేదు. అది జగన్‌కు కంటగింపుగా మారింది. తన పార్టీ తరఫున పడవిలోకి వచ్చి, తనకు ఉపయోగపడక పోవడం ఏమిటన్నది జగన్ వాదన. కానీ శాసన మండలి ఛైర్మన్ హోదా అనేది, రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవలసిన బాధ్యత కాబట్టి, తన పరిమితులు తనకు వున్నాయని మోషెన్‌రాజు అభిప్రాయం. ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీస్తున్నది అంచనా వేస్తున్నారు. మోషెన్‌రాజుకు వచ్చే జూన్ వరకు పదవీ కాలం మిగిలి వుంది.
మండలి ఛైర్మన్ పై జగన్ ఆగ్రహం!?
జగన్మోహన్ రెడ్డి మోషన్ రాజుల ఆత్మీయ కలయిక