అవనిగడ్డ: ఫిబ్రవరి,28 తెలుగు న్యూస్ పవర్)కృష్ణారావు సేవాభావం ఆదర్శనీయం మంచితనం అనుసరణీయమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, దివిసీమ గాంధీ స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి సీపీఐ నియోజకవర్గ నాయకులు అడ్డాడ ప్రసాద్ బాబు, హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ, మల్లుపెద్ది రత్నకుమారి, కుంపటి వెంకటేశ్వరరావు, మాలెంపాటి కోటేశ్వరరావు, కొర్రపాటి ముఖర్జీ, పీ.రాజారత్నం, ఎల్.నాగేశ్వరరావు, పెనుమత్స ప్రభాకరరావు, దాసరి రామయ్య, నక్కా శ్రీనివాసరావు, సిద్ధాబత్తుల బాలయ్య, చండ్ర సుబ్బారావు, నారేపాలెం శంకరరావు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ, ఎంవీ కృష్ణారావు చరిత్ర నేటి యువతరానికి తెలియాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు కృష్ణారావు చేసిన నిరాడంబర సేవలు చిరస్మరణీయం అన్నారు. మారుమూల గ్రామాలకు, తీర గ్రామాలకు త్రాగునీరు, రహదారులు తదితర మౌలిక సౌకర్యాలు కృష్ణారావు కల్పించారన్నారు. తెలుగు భాష కోసం కృష్ణారావు చేసిన కృషి అనన్య సామాన్యమని, అదే పరంపరను వారి తనయుడు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కొనసాగించడం అభిలషనీయం అన్నారు. కృష్ణారావు శతజయంతిలో పాల్గొనడం తమకు గర్వకారణం అన్నారు.
హనుమానుల సురేంద్రనాధ్ బెనర్జీ మాట్లాడుతూ కృష్ణారావు తన సేవలతో ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి పేరు తెచ్చారన్నారు. నిస్వార్థంగా నిజాయితీగా కృష్ణారావు చేసిన ప్రజాసేవకు ప్రతిఫలంగానే వారి శతజయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా గ్రామ గ్రామాన ఘనంగా జరుగుతున్నాయన్నారు. దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకునేందుకు, ఉప్పెనతో ధ్వంసమైన తీర గ్రామాల నిర్మాణానికి కృష్ణారావు కృషి అనన్య సామాన్యం అన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో కృష్ణారావుతో కలిసి కమ్యూనిస్టు పార్టీ చేసిన సేవలు స్మరించుకున్నారు. తమ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలు చేసి ప్రపంచ దేశాల నుంచి శాంతి అవార్డులు అందుకున్న చండ్ర రాజేశ్వరరావు చిన్న వయసులో కృష్ణారావు తండ్రి మండలి వెంకట రామయ్య వద్ధ పాఠాలు నేర్చుకున్నారని తెలిపారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం కమిటీల ప్రతినిధులు, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాధ్ ప్రసాద్, నీటి సంఘాల అధ్యక్షులు రేపల్లె రవీంద్ర, చుండూరు నాగేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, యర్రంశెట్టి సుబ్బారావు, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, శివాలయం చైర్మన్ ఘంటసాల కన్నయ్య, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షులు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, కూటమి నాయకులు బండే రాఘవ, కూరాకుల శివప్రసాద్, బచ్చు శ్రీహరి, డేగల రాఘవ, పులిగడ్డ బాలు శ్రీనివాస్, ఆకుల సీతామహాలక్ష్మి, డైరెక్టర్ అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, బాలమ్మ, ప్రజా సంఘాల కన్వీనర్ నారేపాలెం శంకరరావు, వార్డ్ సభ్యులు అడపా వెంకటేశ్వరరావు, నాయకులు మండలి రామ్మోహనరావు, లుక్కా వెంకట పిచ్చియ్య, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, లుక్కా శ్రీనివాసరావు, భోగాది బాలకృష్ణ, బడే సుబ్బారావు, గుగ్గిలం శ్యాంకుమార్, షేక్ మొగల్ మురాద్ బేగ్, బాబావలీ, బషీర్, సోమిరెడ్డి, సీహెచ్ హరినాథబాబు, బడే సుబ్బారావు, యాసం శ్రీరాములు, మైలా హరిబాబు, కొండవీటి పాండురంగారావు, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, గుడివాక రాము, వాహేదుల్లా తదితరులు పాల్గొన్నారు.