Telugu News Power

మహిళ అనుమానస్పద మృతి

మృతురాలు రాధ

పాలకొల్లు:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్)స్థానిక పెంకుళ్ళపాడు సమీపంలో ఉన్న టిట్కో, ఎల్. అండ్ టి. కాలనీ వద్ద ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మృతురాలు పేరు తాడి రాధా(30) గా గుర్తించారు. ఈమె పదేళ్ళు గా భర్తకు దూరంగా ఉంటున్నారని తెలిపారు. సుధాకర్ అనే వ్యక్తితో ఈమె గత ఏడేళ్లుగా సహజీవనం సాగిస్తున్నట్టు వెల్లడించారు. ఈ జంట మంగళవారం తెల్లవారుజామున గొడవ పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక సి బ్లాక్ 65 నెంబర్ గల ఫ్లాట్ నాలుగో అంతస్తు పైనుంచి మృతురాలిని సుధాకర్ నెట్టి వేయడంతో ఆమె కింద పడి మరణించినట్టు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈమెతోపాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉంటున్నారు. జిల్లా ఎస్పీ నయూం ఆద్మీ, నర్సాపురం డి.ఎస్.పి శ్రీ వేద ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. స్థానిక సీఐ కే.రజనీ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై జి పృద్వి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేస్తారని పోలీసులు తెలిపారు. ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.