పాలకొల్లు డిసెంబర్ 10 తెలుగు న్యూస్ పవర్
ప్రతి ఒక్కరు మానవ హక్కులను గౌరవించాలని న్యాయవాది రాజా శ్యామల పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం స్థానిక ఏ సంఘం గవర్నమెంట్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యు ఎన్ ఓ) డిక్లరేషన్ ద్వారా లభించిన మానవ హక్కులను పరిరక్షించుకోవాలని కోరారు. ఇది అందరి బాధ్యతని తెలిపారు. ఇదే సందర్భంలో పౌరులు తమ బాధ్యతలను కూడా గుర్తు ఎరగాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక యాంటీ ర్యాగింగ్ కమిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్స్ మరియు మహిళా సాధికార విభాగం ఆధ్వర్యంలో, మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ,, సిహెచ్ ఉషారాణి బి కె వి రామలక్ష్మి, బూసి వెంకటస్వామి,, బి వి కె రామలక్ష్మి, పాల్గొన్నారు. మండల న్యాయ సేవ కమిటీ సభ్యులు ఎం బి ఎస్ ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేపీ శ్రీనాథ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మానవ హక్కులను గౌరవించాలి