పాలకొల్లు: ఫిబ్రవరి, 2( తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి భక్తులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రదక్షణ చేశారు. ప్రతివారం భక్తులు ఏడు మారేడు దళములతో 7 ఏడు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వారం భక్తులు అధిక సంఖ్యలో, సుమారు 300 మంది పాల్గొన్నారు. దేవస్థానం వారు వీరికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదక్షిణలో ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, పర్యవేక్షకులు పి వాసు,భక్తులు పాల్గొన్నారు. ఆలయ ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలాధ్యక్షుడు మీసాల రామచంద్రరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
మారేడు దళములతో ప్రదక్షిణలు
మారేడు దళముల ప్రదక్షణలో భక్తులు