
భీమవరం: ఫిబ్రవరి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, తెలుగు ప్రజల ఇష్ట దైవం, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం కానుకగా సమర్పించుకున్నారు. ఈ కనకం విలువ సుమారు లక్షా 50 వేల రూపాయలు. మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు, సంపూర్ణ పసిడి తొడుగు చేయించాలని దేవస్థానం వారు సంకల్పించారు. ఈ పథకానికి స్వర్ణనిధిగా నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా పలువురు భక్తులు అమ్మవారికి బంగారం విరాళంగా సమర్పించుకుంటున్నారు. ఆలయ అర్చకులు, వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, శేష వస్త్రం తో పాటు అమ్మవారి చిత్రం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మల్లు వలస లక్ష్మీ నిర్మల, గొంతెన రమణ, తదితరులు పాల్గొన్నారు.