Telugu News Power

మూలస్థానేశ్వరి అమ్మవారికి భారీ బంగారు ఆభరణాల సమర్పణ

యలమంచిలి నవంబర్ 28 తెలుగు న్యూస్ పవర్ మండల కేంద్రమైన యలమంచిలి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారికి శుక్రవారం సాయంత్రం బంగారు ఆభరణాలు సమర్పించారు. యలమంచిలి వాస్తవ్యులు తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి శిరీష దంపతులు ఈ కానుకలు అందజేశారు. ఈ దంపతుల కోర్కెలు ఈడేర్చినందుకుగాను, అమ్మవారికి భక్తితో ఈ భారీ కానుకలు బహుమతిగా అందజేశారు. అమ్మవారికి నల్లపూసల రూపంలో 24 గ్రాముల బంగారంతో చేయించారు. ఈ ఆభరణం విలువ దాదాపు మూడు లక్షల రూపాయల వరకు ఉంటుంది. అలాగే అమ్మవారి వెండి వడ్డానంపై బంగారం పూతతో అం లక్షల రూపాయల విలువైన ఆభరణాలు శ్రీనివాస్ అమ్మవారికి కానుకగా ఇచ్చారు. ఈ కార్యక్రమం చాలా సాధారణంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మూలస్థానేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షులు బొల్లంపల్లి శ్రీనివాస్ తాడూరి శ్రీనివాస్ నల్లి వినోద్ మండల తెలుగుదేశం అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు కమిటీ సభ్యులు సిద్ధాని రాము, ఆకులు ఏసు తదితరులు ఈ బహుకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.