Telugu News Power

మెగా ఫౌండేషన్, మెగా వైద్య శిబిరం.

వైద్య శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న చైర్మన్ గాంధీ భగవాన్ రాజు
రక్తదానం చేస్తున్న పోలీసు అధికారులు

పాలకొల్లు: మార్చి,4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి గాంధీ మెగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెగా కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం జరిగింది. పాలకొల్లు పట్టణ సిఐ కోల రజనీ కుమార్, వారి సిబ్బందితో కలిసి ఈ శిబిరానికి వచ్చి,రక్తదానం చేయటం విశేషం. పాలకొల్లు పూర్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కాష్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ చైర్మన్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక అమరావతి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఫౌండేషన్ తరపున కళ్ళజోళ్ళు అవసరమైన వారికి ఉచితంగా అందజేస్తామని చైర్మన్ రాజు తెలిపారు. శిబిరంలో వైద్య సేవలు పొందిన వారికి ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామ ప్రముఖులు వేగేస్న శ్రీహరి రాజు, ఉనికిలి నాగేశ్వరరావు, గొట్టుముక్కల శ్రీనివాసరాజు, నున్న బోయిన సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి, పాల శ్రీనివాస్, ఎస్సై పృథ్వి, జి జే ప్రసాద్ లు తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.