Telugu News Power

యలమంచిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సభ మాట్లాడుతున్న సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిశోర్
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న బోనం నాని

యలమంచిలి:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్)
మండల కేంద్రమైన యలమంచిలిలో సార్వ ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభమైంది. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బోనం నాని గురువారం ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్ది ధాన్యం తేమ కొలిచే యంత్రాన్ని ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిశోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు కావలసిన అన్ని విషయాల్లో ప్రభుత్వం సహకారం అందిస్తున్నదన్నారు, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రసాద్, ,త్రిపుర సుందరిలు, ధాన్యం అమ్మకంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు మామిడిశ్చేట్టి పెద్దిరాజు, శిరగాలపల్లి సొసైటీ చిలుకూరు మురళి ప్రసాద్, ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు చిట్టూరి ఆంజనేయులు, ఆరమిల్లి చిన్ని, చిలుకూరి శ్రీనివాస్ సొసైటీ కార్యదర్శి తమ్మి నీడి శాంతకుమారి, తమ్మినీడివెంకటరామయ్య వారి సిబ్బంది సందీప్, శివ, మండల రైతులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

తేమ శాతం కొలిచే యంత్రాన్ని ప్రారంభిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్ది