Telugu News Power

యలమంచిలి లో మీ భూమి-మీ హక్కు కార్యక్రమం.

మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాసుబుక్కులు అందుకున్న రైతులు

యమంచిలి: ఏప్రిల్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక చించినాడా, కాజ గ్రామాల్లో గురువారం మీ భూమి – మీ హక్కు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దాదాపు 40 మందికి భూమి హక్కుకు సంబంధించి కొత్త పాస్ పుస్తకాలు సభలో అందజేశారు. రీ సర్వే చేసి రైతులకు ఖచ్చితమైన సమాచారంతో పాసుబుక్కు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంతో ఈ కార్యక్రమం చేయబడ్డారు. కార్యక్రమంలో, తహసిల్దార్ పవన్ కుమార్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్, చిలుకూరి బాలాజీ, రుద్రరాజు సత్యనారాయణ రాజు, పంజా నరసింహారావు, పెదకాపు, టిడిపి మండల అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, మాజీ జెడ్పిటిసి బోనం నాని, నీటి సంఘాల అధ్యక్షులు మాత రత్నం రాజు, ఆరమిల్లి రామ శ్రీనివాస్, ఎంపీటీసీ జి. రత్నంరాజు, పలువురు రైతులు పాల్గొన్నారు.