పాలకొల్లు: ఏప్రిల్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్)
సామాజిక స్పృహతో
బాధ్యతలు నిర్వహిస్తూ దండు పద్మావతి గురువారం జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ రక్తదాన శిబిరంలో స్వయంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని, యుటిఎఫ్ యలమంచిలి మండల శాఖ కృతజ్ఞతలు తెలిపింది.రక్తదానం చేయడం కోసం, తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుని వైద్యుల అనుమతి పొంది, కుటుంబ సభ్యుల సహకారం కూడా తీసుకుని రక్తదానం చేయడం ఆదర్శనీయమని కొనియయాడారు.
ప్రధానోపాధ్యాయురాలిగా, యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా దండు పద్మావతి విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. షేక్ పీర్ సాహెబ్ , ఈ శ్రీదేవి, వినాయక్ , కర్రా లక్ష్మీ సత్యనారాయణ, తదితర 23 మంది రక్తదాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
యుటిఎఫ్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ రక్తదాన శిబిరం.
దండు పద్మావతికి జ్ఞాపిక అందజేస్తున్న ఎంఈఓ గుమ్మల్ల వీరాస్వామి