యమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతిలో మంచి మార్కులు తో పాస్ కావాలని యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి కోరారు. యుటిఎఫ్ ఉచితంగా పంపిణీ చేస్తున్న టెస్ట్ పేపర్ల వితరణ కార్యక్రమంలో భాగంగా ఏనుగులంక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వీరి సౌజన్యంతో ఇస్తున్న పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు వినుకొండ రవి విద్యార్థులు పైకి రావడానికి చదువు ఎంతో ముఖ్యమని తెలిపారు. పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి తన సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ నారిన రామకృష్ణ, తోలేటి గాంధీ, ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ఎస్వి ఆచారి, యుటిఎఫ్ జిల్లా నాయకులు పోలిశెట్టి క్రాంతి కుమార్, మండల శాఖ అధ్యక్షులు జి.శ్రీనివాసరావు, వైవి చల్లా రావు, వేణుగోపాల్ రాజు, ఏం సుభద్ర, బుద్దేశ్వర రావు అడబాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.