పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయుల, సుదీర్ఘకాల, పెండింగ్ సమస్యలపై రణభేరి కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, యుటిఎఫ్ సంఘం పిలుపునిచ్చింది. ఈనెల 17న విజయవాడలో ఉపాధ్యాయుల భారీ ప్రదర్శనకు సంసిద్ధులయ్యారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా, మొండిచేయి చూపటంతో, ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల17న తమకు రావలసిన ఆర్థిక బకాయిలు,పిఆర్సి కమిటీ నియామకం, ఐఆర్ ప్రకటించడం పై విజయవాడలో జరిగే రణభేరి 2.0 చలో విజయవాడకు ఎలమంచిలి మండలం నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి హై స్కూల్ శాఖ నుంచి కనీసం పది మంది హాజరుకావాల్సిందిగా కోరారు.
వివిధ రూట్లులో వచ్చేవారి వివరాలు ఈ క్రింద విధంగా తెలియజేశారు.
బాధ్యులు,దొడ్డిపట్ల హైస్కూల్ శాఖ,బాపిరాజు ఇలపకుర్రు,జి శ్రీనివాసరావు,గుంపర్రు, నాగ శ్రీనివాసు,మట్లపాలెంవి సందీప్ కుమార్, సిరగాలపల్లి,బి శైలజ
మేడపాడు, ఎం శ్రీధర్
ఎలమంచిలి,ఎం రాంబాబు
చించినాడ,కే శరత్ బాబు
వైవి లంక,పి శ్రవణ్ కుమార్
కాజా,కుడిపూడి సత్యనారాయణ
కొంతేరు,డి చంద్రశేఖర్ బాధ్యతలు వహించాలని నిర్దేశించారు.
యుటిఎఫ్ రణభేరికి 17న తరలిరావాలి.