Telugu News Power

యు.టి.ఎఫ్. టెట్ పై ధర్నా

వినతిపత్రం సమర్పిస్తున్న యుటిఎఫ్ నాయకులు ఎమ్మెల్సీ బోర్ర గోపి మూర్తి, అంగర రామభద్రం తదితరులు.

భీమవరం:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్,రాష్ట్ర సంఘం టెట్ పై ఇచ్చిన కార్యాచరణ పిలుపుమేరకు, గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్ల తో ప్రాతినిధ్యం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు. 2. టెట్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఓడి మంజూరు చేయాలన్నారు.3. బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంటనే విడుదల చేయాలని 4. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుల సెలవు సమస్య పరిష్కరించాలన్నారు.5. పదవ తరగతి వందరోజుల కార్యక్రమంలో సెలవు దినాలు, పండుగ రోజులు మినహాయించాలని కోరారు.6. విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష నిర్వహించాలన్న నిబంధన తొలగించాలన్నారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి కి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ కు ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి ఆధ్వర్యంలో యుటిఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయరామరాజు, రాజశేఖర్, రాజ్ కుమార్,శివప్రసాద్, రత్నరాజు, జి కుమార్, రామకృష్ణరాజు తదితరులు హాజరయ్యారు. పలువురు ఉపాధ్యాయులు ధర్నా లో పాల్గొన్నారు.