Telugu News Power

యు టి ఎఫ్ యలమంచిలి మండల శాఖ వైద్య శిబిరం.

డాక్టర్ వి రమేష్ ను సత్కరిస్తున్న యుటిఎఫ్ నాయకులు
మహిళలకు క్యాన్సర్ వ్యాధి నివారణ,అవగాహన పై మాట్లాడుతున్న డాక్టర్ కావాలి.

పాలకొల్లు డిసెంబర్ 14 తెలుగు న్యూస్ పవర్ యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎలమంచిలి మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా షాబ్జి ఉద్యమాల్లో ప్రదర్శించిన ధైర్య సాహసాలను, సేవా భావాన్ని పలువురు యుటిఎఫ్ నాయకులు కొనియాడారు. ఈ శిబిరాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, బాబ్జి, శ్రీ వైష్ణవి హై స్కూల్ లో ప్రారంభించారు. ఈ శిబిరంలో చక్కెర వ్యాధి నిపుణులు డాక్టర్ వి.రమేష్, స్త్రీవ్యాధి నిపునులు డాక్టర్ కావలి ఉమాదేవి వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో ఇసీజీ ,చక్కర వ్యాధి పరీక్షలు నిర్వహించారు. మందులు ఉచితంగా పంచారు. ఈ కార్యక్రమంలో షేక్ బాబ్జి కుటుంబ సభ్యులు సుభాని బేగం, అబ్దుల్ కలాం, పూర్వ యుటిఎఫ్ ప్రముఖులు దేవ సుధాకర్, పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే, అజయ్ కుమార్, జిల్లా నాయకులు అంగర రాంబద్రం, పోలిశెట్టి క్రాంతి కుమార్, గుత్తుందీవి శ్రీనివాసరావు, పంతం రామ్మూర్తి నాయుడు, పులఖండం డం శ్రీనివాస్, పలువురు యువ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరం నిర్వహించడం పట్ల మండల యూటీఎఫ్ శాఖను జిల్లా శాఖ అవినందించింది.

షాబ్జి వర్ధంతి సభలో మాట్లాడుతున్న బేగం