Telugu News Power

రంగుల హరివిల్లు,ఉరుములఘర్జన దీపావళి

 https://www.youtube.com/watch?v=U9mAg1KKoRg

ఒక దేశం ఒక పండుగగా చెప్పుకొనే ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. భారతీయులు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా తప్పక జరుపుకొనే దీపాల పండుగ. రాముడు యుద్ధంలో గెలిచి రావణ సంహారం తరువాత విజయోత్సవం, కృష్ణుడు నరకుని వధించి వచ్చిన శుభసందర్భంగా ఈ పండుగగాచెప్పబడింది. ఏమైనా చెడు పై మంచే విజయం సాధిస్తున్నదనే సందేశం దీపావళి. పిల్లలు, కొత్త అల్లుళ్ళు, యువకులు ఆనందోత్సాహాలతో జరుపుకొనే దీపాల పండుగ. పదోతరగతిలో పది మార్కులు తెచ్చే వ్యాసం, దీపావళి హిందువోంక ప్రముఖ చ్యోహర్ హై అంటే అంత ఇష్ఠం. భారత దేశంతో పాటు చుట్టు పక్కల ఐదు దేశాల్లో ఈ పండుగ జరుపుకొంటారు. అమెరికాలో కొన్ని పాఠశాలలు దీపావళి సెలవు ప్రకటిస్తాయి.
ప్రతి ఏటా అశ్వీజమాసంలో అమావాస్య రోజు వచ్చే ఈ పండుగ రెండు రోజుల లో వచ్చింది . అయితే లక్ష్మి పూజ సోమవారం రాత్రి జరుపుకోవాలని, మంగళవారం ఉదయనీకే అమావాస్య వెళిపోతున్నందున పండుగ సోమవారమే జరుపుకోవాలని పండితులు తెలియజేశారు.
దీపావళి మందుగుండు సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోవడంతో, వర్షం సహకరించడంతో వ్యాపారం బాగానే జరిగిందని అంటున్నారు. జీ ఎస్టీ 18% లో ఈ సారి రాయితీ ఏమీ రాలేదు. ఈ రోజు కోసం ఏటా దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. కార్పొరేట్లు తమ ఉద్యోగులకు, కస్టమర్లకు ఇచ్చే 32 వేల కోట్ల బహుమతులు ఇందుకు అదనం. ఒక్క శివ కాశీ లోనే ఆరు వేల కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తుందని చెబుతారు. 1150 ఫ్యాక్టరీల్లో 4లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ది. ఎమ్మెస్ ఎమ్మీ లు, చిన్న, మధ్య తరహాలో తయారీ సంస్థలు అదనం. ఈ సారి చైనా సరుకు సరఫరా కొంత కట్టడి చేయడాకి ప్రచారం ఉపయోగ పడుతుందని తెలుస్తోంది. పర్యావరణహిత దీపావళి మందులు 70% మంది కోరుతుండగా, అందులో 30 శాతం మాత్రమే అమలు జరుగుతున్నది.
పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో మందుగుండు సామాగ్రి తయారీకి ప్రసిద్ధి. అయితే ఇప్పుడు ఆ వృత్తిపై అంతగా ఆసక్తి కనిపించడం లేదంటున్నారు. ఇక్కడే 3కోట్ల వ్యాపారం జరగవచ్చని అంచనా. ఈ వ్యాపారం లో 70- 50 ఏళ్ళ నుంచి ఉన్న 3 వ్యాపార సంస్థలు పేరు పొందాయి. వీటికి మాత్రమే లైసెన్సులు ఉండగా మిగతా చిన్న చితక వంద వరకూ ఉన్న వారు తాత్కాలిక లైసెన్సులు పై వ్యాపారం చేస్తారని తెలిపారు. ఈ ఏడాది కొనుగోలుదార్ల రద్దీ వల్ల కొన్ని షాపులు షట్టర్లు మూసి తెరచి వంతుల వారిగా కొనుగోలుదార్లను అనుమతించారు. కొన్ని షాపులు మధ్యాహ్నానికి వ్యాపారం ముగించారు. వ్యాపారం సజావుగా సాగడానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకరించారు. ఎప్పటిలాగే ఇక్కడ కూడా దీపావళి వెలుగులు లేని వెండి గాంధీలు, వేషధారులు ప్రత్యక్షం కొసమెరుపు. ఈ నెల్లాళ్ళు ఎంతో మందికి, ఎన్నో రకాల ఉపాధి కల్పించిన దీపావళి ఇక తనతో పాటు వారికి కూడా విరామం ఇచ్చింది.