Telugu News Power

రాజమండ్రి, కొవ్వూరులకు కొత్త ఆర్డీవోలు.

రాజమండ్రి, మార్చి ,27 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలుగా బాధ్యతలు స్వీకరించిన ఆర్. శివరాముడు, కాకర ఆనందరావు, రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను రాజమహేంద్రవరంలో వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై, వారి సమస్యలను సకాలంలో గుర్తించి, త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలని కోరారు. రెండు డివిజన్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం, కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టితో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.