Telugu News Power

రాష్ట్ర ప్రగతి పై అద్భుత చిత్ర ప్రదర్శన.

చిత్రకారులను సత్కరిస్తున్న మంత్రి నిర్మల రామానాయుడు

పాలకొల్లు: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక వపాబాపు, వడ్డాది పాపయ్య, బాపు ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు చిత్రకళకు సంబంధించి కార్యక్రమం నిర్వహించారు. సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఈ భారీ చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. గత దశాబ్ద కాలంగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వీరు నిర్వహిస్తూ, వస్తున్నారు. బాలబాలికల్లో చిత్రకళ పట్ల ఆసక్తి కల్పించడానికి వారిని ఈ ప్రదర్శనలో భాగస్వాములను చేసి, వారి సృజనాత్మకత ను వెలికి తీసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం బాలలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. దక్షిణ భారత చిత్రకారులచే ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ప్రముఖ చిత్రకారులచే ఆదివారం ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు,ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని, చిత్రకళా ప్రదర్శనకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక చిత్రకారుల కృషిని అభినందించారు. ప్రముఖ చిత్రకారులను, ప్రోత్సాహకులను మంత్రి సత్కరించారు. చిత్ర కళా ప్రదర్శనలో పాల్గొన్న వారందరినీ సత్కరించారు. స్థానిక లయన్స్ క్లబ్ వారు ఈ ప్రదర్శనకు వేదికను ఇచ్చారు. దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కళా ప్రదర్శన ప్రత్యేకంగా నిర్వహించడానికి సుమారు నెల్లాల్లుగా స్థానిక చిత్రకారులు, శ్రమించవలసి వచ్చింది. చిత్ర ప్రదర్శన విజయవంతం కావడంతో వారి శ్రమకు తగిన ఫలితం దక్కినట్లుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం పలువురు ప్రముఖుల సౌజన్యంతో నిర్వహించగలిగినట్లు కళాకారులు తెలిపారు. కొమ్ముల మురళీకృష్ణ, ముత్యాల రామారావు, మద్దాల వాసు, వంగ నరసింహారావు, రెడ్డి చిన్న, విడిటి కిరణ్, పాట పళ్ళ నాగ దుర్గ వర ప్రసాద్ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ సౌజన్యాన్ని అందించి సహకరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు దొంగ రామకృష్ణ, రాకీ, గౌరవ అధ్యక్షులు కోసన భాస్కరరావు, అధ్యక్షులు కడలి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు నక్క వెంకటేశ్వర రావు, చెల్లుబోయిన రాము, కార్యదర్శి, వాకలపూడి రాము, గంపన బోయిన రాజశేఖర్, బుడితి రామారావు, పీతాని శ్రీనివాస్, కోశాధికారి నాగ వెంకట కృష్ణారావు, పలువురు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలు, వివిధ జిల్లాల నుంచి, కేరళ, కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చిన ప్రముఖ చిత్రకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి,, ప్రోత్సాహకులు వంగా నరసింహారావు, ప్రముఖ చిత్రకారులను ఘనంగా సత్కరించారు.