Telugu News Power

రెండు చుక్కల పోలియో మందుతో అంగవైకల్యం నుంచి రక్ష

పాలకొల్లు:డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) ఐదేళ్ల లోపు బిడ్డలందరికీ పోలియో మందు రెండు చుక్కలు వేయించడం వల్ల వారిని పోలియో వల్ల వచ్చే అంగవైకల్యాన్ని శాశ్వతంగా తరిమికొట్టవచ్చు అని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి వరప్రసాద్ పేర్కొన్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న లంకలకోడేరు లోని, ఉప్పరిగుడం లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న సర్వే విధానం ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయించుకోని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. స్థానిక ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నవ్య జీవన్ పల్స్ పోలియో కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఘమిని గణేష్, సిహెచ్ఓ రమేష్ రెడ్డి, విస్తరణాధికారి,గుడాల హరిబాబు, ఎలిజిబెత్, అమలేశ్వరరావు, దివాకర్ బాబు, టీ హరిబాబు, ఏ ఎన్ ఎం లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.