Telugu News Power

రైతులు వెంటనే ఈ-పంట నమోదు చేసుకోవాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి, 20(తెలుగు న్యూస్ పవర్) రైతులు వెంటనే ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని, స్థానిక వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ శుక్రవారంవిజ్ఞప్తి చేశారు. ఈనెల 25 ఈ-క్రాప్ నమోదుకు గడువు ముస్తుందని వెల్లడించారు. పాలకొల్లు మండలంలో 9,900, పోడూరు మండలంలో14,500, ఆచంట మండలం10, 250 ఎకరాల్లో దాళ్వాపంట సాగుతున్నట్టు నమోదయింది. ఇప్పటికీ కూడా కొంతమంది విదేశాల్లో ఉన్నవారు, రాస్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నవారు, ఓటిపి ద్వారా కూడా ఈ-నమోదు చేయించుకోవచ్చు అని తెలిపారు. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్(ఏపీ ఎఫ్ ఆర్) ఆంధ్రప్రదేశ్ లోతప్పనిసరిగా చేయించుకోవాలని కోరారు. యూనిక్ ఐడి నెంబర్ కోసం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు అన్ని సౌకర్యాలు ఈ ఐడి ద్వారా మాత్రమే అందుతాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందటానికి ఐడి నెంబర్ ఆయా రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలని పేర్కొన్నారు.