తిరుపతి: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి, తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేంచేసి ఉన్న, కొండగట్టు అంజన్నగా పిలుచుకునే ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేస్తారు. జనసేన అధినేత,ఉపముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్ ఇష్టదైవాల్లో ఒకరైన అంజన్నకు గతంలో ఈ హామీ ఇచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఆ మేరకు టీటీడీ ఈ నిర్ణయం ప్రకటించింది. సుమారు 2వేల మంది భక్తుల దీక్ష విరమణకు సౌకర్యంగా ఈ మండపం నిర్మిస్తున్నారు. ఇక్కడ 96 గదుల వసతి గల సత్రం నిర్మాణానికి కూడ టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా భక్తులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధర్మ పరిరక్షకుడిని అభినందనలు తెలియజేసుకుంటున్నారు.
వరంగల్ జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి 35 కోట్ల నిధులు