Telugu News Power

వాకర్స్ క్లబ్బుచే 40వేల ఉచిత మందుల పంపిణీ

మందులు పంపిణీ చేస్తున్న వాకర్స్ క్లబ్ కమిటీ

పాలకొల్లు:డిసెంబర్,30 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్, మంగళవారం 40వేల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముత్యాలపాలెం వాసి, మేరీ కుమారి గుండె సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి మందులు అవసరం కాగా, వాకర్స్ క్లబ్, పాలకొల్లు వారిని సంప్రదించారు. క్లబ్ వారు మానవతా దృక్పథంతో ఆమెకు 30 వేల రూపాయల విలువైన ఔషధాలు అందజేశారు. పెదమామిడిపల్లికి చెందిన గూడపాటి అనంతలక్ష్మికి 5వేల రూపాయల విలువైన మందులు ఇచ్చారు. స్థానిక ఏడవ వార్డు మడక ఈశ్వరమ్మకు 7వేల రూపాయల విలువైన వినికిడి యంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తటవర్తి సుధాకర్, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మాణెం బసవరాజు, ధనాని శ్రీరామ్మూర్తి, కోశాధికారి పోతుల ఉమాశంకర్, జవ్వాజి కళ్యాణ్, నంబూరి గంగా పవన్, బాసిన సత్యనారాయణ, కెవి రమణ తదితరులు పాల్గొన్నారు.