పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులకు వృత్తి విద్యా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ప్రారంభించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులకు టైలరింగ్, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు ఎంబ్రాయిడరీ నేర్పుతారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ ఫౌండేషన్, కళాశాల మహిళా సాధికారిక విభాగం సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మహిళలు స్వశక్తిపై ఆధారపడి జీవించటానికి ఇలాంటి శిక్షణ ఇస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థినులకు నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ టీ కృష్ణ, బి వెంకట స్వామి, వి యామిని, ఫౌండేషన్ ప్రతినిధులు జాన్ బాబు, జాన్, నర్సాపురం పోలీస్ అధికారి విఎన్ఏ మూర్తి, కన్వీన రామలక్ష్మి, మహిళా అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.