Telugu News Power

విద్యా వ్యవస్థ బలోపేతానికి విప్లవాత్మక మార్పులు – మంత్రి నిమ్మల

సభలో ప్రసంగిస్తున్న మంత్రి నిమ్మల

పోడూరు: డిసెంబర్ 5 (తెలుగు న్యూస్ పవర్) విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా ఆత్మీయ సమ్మేళనం మూడో విడత సందర్భంగా జున్నూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర విద్యాశా ఖామాత్యులు,నారా లోకేష్, ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, విద్యార్థులు మధ్య సమన్వయంతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇంతవరకు ఉన్న ఉపాధ్యాయుల కొరత కూటమి ప్రభుత్వం తీర్చిందన్నారు.
విద్యార్థులకు అవసరమైన వస్తు సామాగ్రి అందించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉపాధ్యాయ నియామకాలు పొందటంలో పాలకొల్లు నియోజకవర్గం ముందు వరుసలో నిలిచిందన్నారు. డీఎస్సీ అభ్యర్థుల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, రాష్ట్రంలో ఉన్న బెస్ట్ ఫ్యాకల్టీ చే వారికి కోచింగ్ ఇప్పించామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెల్లుబోయిన శివ జ్యోతి డీఎస్సీ కోచింగ్ సందర్భంగా ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ సభలో ప్రశంసించారు. జున్నూరు హై స్కూల్ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న పాఠశాలగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఒక సామాన్యునిల విద్యార్థులతో వ్యవహరించారు. వారితో కలిసి సహభక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు. ఒక విద్యార్థి తమ తల్లిదండ్రులు ఇద్దరు స్థానికంగా లేరని, ఇతర దేశాల్లో ఉంటున్నారని తెలిపింది. మంత్రి వారిని చరవాణిలో సంప్రదించి, తమ బిడ్డలను మంచిగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. ఇందువల్ల వారు వేరే దేశానికి వెళ్లవలసిన అవసరం ఉండదన్నారు. మంత్రి తిన్న ప్లేట్ స్వయంగా కడిగి,విద్యార్థికి ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆధ్యంతం,అత్యంత ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయం మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు దాసరత్నం రాజు, సొసైటీ అధ్యక్షులు దేవళ్ళ ప్రసాద్, బిజెపి రాష్ట్ర నాయకులు యు. కాపర్ది, యర్రంశెట్టి పద్మారావు తదితర కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

విదేశాల్లో ఉన్న విద్యార్థి తండ్రితో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల.

 

పాలకొల్లు ఎం ఎం కె హై స్కూల్ లో హాజరైన తల్లిదండ్రులు.