Telugu News Power

విప్లవ వీరుడు ఉయ్యాలవాడ విగ్రహావిష్కరణ.

భారతీయుల ధైర్య సాహసాలను ఆదిలోనే రుచి చూపిన విప్లవ వీరుడు, తెల్ల వాళ్ళ గుండెల్లో నిద్రపోయిన విప్లవ జ్యోతి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ ఘనంగా ఆదివారం జరిగింది. మార్టేరు కూడలి దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్రరోడ్లు భవనాల శాఖమంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విశేషంగా ప్రజలు తరలి వచ్చారు. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, రాష్ట్ర రవాణా శాఖమంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విగ్రహ దాత సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎస్ ఆర్ గోపీనాథ్ రెడ్డి,కాయల వెంకటరెడ్డి, ద్వారంపూడి వేణుగోపాలకృష్ణారెడ్డి ,పంచ గ్రామం రెడ్డి సేవా సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,ఆచారి స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.