Telugu News Power

వెండి మకర తోరణం కానుక

బంగారు కృష్ణ బాబు కుటుంబ సభ్యులతో మంత్రి నిమ్మల

పాలకొల్లు: జనవరి, 21, (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, కుక్కల గుడి అనే రామాలయం దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, స్వామివారికి 18 కేజీల వెండితో చేయించిన మకర తోరణాన్ని బంగారు కృష్ణ బాబు, నాగరాణి దంపతులు కానుక సమర్పించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు, అమృత హస్తాలతో బుధవారం, స్వామివారికి అలంకరింప చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి, పాలకొల్లుకే గాక పరిసర ప్రాంతాల ప్రజలు కూడా వచ్చి దర్శించుకోవడం, ఈ ఆలయ విశిష్టతను తెలియజేస్తుందన్నారు. కృష్ణ బాబు,నాగరాణి నాగరాణి దంపతులను అభినందించారు. స్థానిక, ఆర్యవైశ్య సమాజం, బంగారు వారి కుటుంబం దాతృత్వంతో పాలకొల్లు విరాజిల్లుతున్నదన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి,మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, చినుగోపురం, పెద గోపురం చైర్మన్ లు, ప్రవీణ్ భాను, మీసాల రామచంద్ర రావు, తెలుగుదేశం నాయకులు పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వర రావు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, తదితరులు హాజరయ్యారు.