Telugu News Power

వైసిపి కుట్రలపై విచారణ జరపాలి. -బిజెపి డిమాండ్.

భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) వైఎస్ఆర్ సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో హిందువులు, హిందూ దేవాలయాలపై జరిగిన కుట్రలపై దర్యాప్తు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు ఆధ్వర్యంలో కలెక్టర్ చదలవాడ నాగరాణికి సోమవారం, భీమరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్న పట్ల కపర్తి,పార్టీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, తదితరులు పాల్గొన్నారు.