పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జి గుడాల హరి గోపాల్ రావు,గోపి స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 18 మంది తటస్తులు ఈరోజు పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్, మాజీ ఫ్లోర్ లీడర్, వైసీపీ సీనియర్ నాయకులు యడ్ల తాతాజీ, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయ మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైసిపి పార్టీలో ఆటో డ్రైవర్ల చేరిక.
వైసీపీ పార్టీలోకి ఆటో డ్రైవర్లు