Telugu News Power

శివరాత్రికి వీరభద్రుని సంబరాలు

వీరభద్రుని సంబరాలకు తరలి వెళ్తున్న భక్తులు

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వీరభద్ర స్వామి సంబరాలు వాడవాడలా జరిగాయి. స్థానిక కొత్తపేట వీరభద్ర స్వామి గుడి వద్ద స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఘటం శిరస్సుపై ధరించారు. భక్తులు వీరభద్రుని గద్దెల నుంచి జమ్మి చెట్టు వద్దకు, దేవాలయాలకు వెళ్లి ప్రసాదాలు, పానకాలు పంచారు. ఈ సందర్భంగా భక్తులు, తుము కోర్కెలు నెరవేర్చాలని, నిప్పుల గుండం పై నడిచారు. యలమంచిలి వీరభద్ర స్వామి గుడి వద్ద సంబరాలు చేసి, నిప్పుల గుండం తొక్కారు. అనంతరం అన్న సమారాధన చేశారు.

నిప్పుల గుండం పై నడుస్తున్న భక్తులు